Book Description
ఈ కథల్లో నాస్టాల్జియా వుంది. జీవన సంఘర్షణ వుంది. అలనాటి స్వచ్ఛత, అమాయకత్వం కూడా వున్నాయి. నిరాడంబరత, సూటిగా, సరళంగా ఉండటం కనిపిస్తుంది. ఈ ఆరు కథలు నాకు ఈ క్షణంలో అమృత సమానంగా అనిపించాయి. మెలోడ్రామాలు చదివి చదివి మొహంమొత్తిన నాకు ఈ కథలు ఆరు మందారరేకులై నా చెక్కిళ్ళను నిమిరినట్లు అనిపించాయి. అనేక భావోద్వేగాలను ఆవిష్కరించే సుప్రయత్నం ఈ కథల్లో నిండుగా మనకు కనిపిస్తుంది. మనుషులు తోటి మనుషులతో పంచుకోవాల్సిన అనుబంధాలను, నింపుకోవాల్సిన సౌందర్యాన్ని కూనపరాజుగారు తోలుబొమ్మలాట కథా సంకలనంలో పాఠకులకి ఆత్మీయంగా అందిస్తున్నారు.