Book Description
నదులు ఎవ్వరిసొత్తూ కావు. పుట్టిన ప్రాంతానికో, ప్రవహించే ప్రదేశానికో పరిమితం కావు. అవి భగవంతుని వరప్రసాదితాలు. అక్షయపాత్రలు. విశ్వమానవ శ్రేయస్సుకు, జగదాభ్యుదయమునకు సృష్టింపబడినవి. ఏ వొక్కరికి స్వంతం కావు. జాతి ఉమ్మడి ఆస్తి, సూర్యచంద్రులను, భూమ్యాకాశాలను, గాలిని, నీటిని ప్రపంచ ప్రజలంతా పంచుకుంటారు. జాతి, కుల, మత, ప్రాంతీయ భాషా విభేదాలు చూడకుండా నదులు తమ సౌభాగ్యాన్ని అంతర్గతశక్తులను అందరికీ సమానంగా పంచుతున్నాయి. మన భారతావనిలో అనవరతమూ ప్రవహించే నదులునేకములున్నవి. జీవననదులని పేరుగాంచినవి. గంగా, యమున, సరస్వతి, జీలం, చీనాబ్, బ్రహ్మపుత్రా, గోదావరి, కృష్ణ, కావేరి మొదలగునవి. ప్రజాజీవిత ప్రత్యంగ సంశోభత్వమునకు కారకములై ఆరాధ్య దైవములుగా పూజింపబడుచున్నవి. ఈ పవిత్రనదులలో స్నానమాచరించిన, పాపాలు హరించునని, సంతానప్రాప్తి కలుగునని విశ్వాసము కూడాయున్నది. ఇక చదవండి వాటి చరిత్రల వైశిష్ట్యము, దైవత్వమున్నూ.