Book Description
పితృకర్మలు వంటివి చేయడం మన ఆచారం. అటువంటి కార్యక్రమాలు పుష్కర సమయంలో చేయడంవల్ల అధిక ఫలాలు కలుగుతాయని శాస్త్రాలు వెల్లడిస్తూ వున్నాయి. ‘‘జన్మ ప్రభృతి యత్పావం స్త్రీ యావా పురుషేణవా పుష్కరే స్నాన మాత్రేణ సర్వమేవ ప్రణశ్యతి’’ అని పుష్కర మహత్మ్యాన్ని గురించి మహాభారతంలో చెప్పబడింది. అంటే పుట్టినది మొదలుకుని ఇప్పటివరకు పాపాలు చేసిన స్త్రీలు అయినా పురుషులు అయినా పుష్కర సమయంలో స్నానం చేసినంతనే ఆ పాపాలన్నీ నశిస్తాయని మహాభారతంలో చెప్పడం పుష్కరమహత్మ్యానికి నిదర్శనం. అటువంటి పుష్కర నదులను స్మరించడం, ఆ నదులను గురించి తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం, సకల పాపహరణం, సకల శ్రేయోదాయకం. పుష్కర నదులను గురించి స్మరించుకుందాం! తెలుసుకుందాం!