Book Description
ప్రకృతిని, అందులోని చరాచరాలన్నింటిలోనూ దైవాన్ని దర్శించగలగడం మన భారతీయ సంస్క•తిలోని ఔన్నత్యం. అటువంటి మనం నీటిని, వాటిని ప్రసాదించే నదీమ తల్లులను గంగాదేవిగా భావించి పూజిస్తాం!! మన దేశంలో అనేక పవిత్ర నదులు వున్నాయి. నదీతీరాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ప్రాచీన కాలంలోనే వెలిశాయి. నదులలో స్నానం చేసి నదీ తీరాల్లోని ఆలయాలను దర్శించడం అత్యంత పుణ్యకార్యంగా భావించడం జరుగుతోంది. మన దేశంలోని ప్రధానమైన, పవిత్రమైన నదులలో ‘గోదావరి’ ఒకటి. తెలుగు వారి జీవన సిరిగా వర్ధిల్లుతూ వున్న గోదావరీ నదీ తీరం వెంట అనేక క్షేత్రాలు వున్నాయి. ఆ క్షేత్రాల్లోని ఆలయాల్లో వివిధ దేవతామూర్తులు కొలువు దీరి పూజలందుకుంటూ వున్నారు. గోదావరి తీరంలోని ప్రధాన క్షేత్ర విశేషాలతో కూడుకున్నదే ఈ పుస్తకం.