Book Description
ప్రజల మధ్య సజీవంగా సంచరించి వారిలో ఒకరిగా జీవించిన మహనీయుడు... మధ్వ పరంపర అనే మణిహారంలో నాయకమణిగా భాసిల్లుతూ వున్న మహోన్నత మహితాత్ముడు అయిన శ్రీ రాఘవేంద్ర స్వామి సశరీరంతో సజీవంగా బృందావన ప్రవేశం చేయగా... ఆ బృందావనం వున్న మహిమాన్విత క్షేత్రం - ‘‘మంత్రాలయం!’’ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి పాదధూళితో పునీతమైన మంత్రాలయ క్షేత్ర దర్శనం సర్వపాపహరణం. సకల పుణ్య దాయకం. మంత్రాలయం లోని స్వామివారి ఆలయంతో పాటూ స్వామివారు స్వయంగా ప్రతిష్ఠించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, మంత్రాలయానికి సమీపంలో స్వామివారు తపస్సు చేసిన ‘‘పంచముఖి’’ క్షేత్రాన్ని దర్శనీయాల్లో ప్రధానమైనవి.