Book Description
‘అమ్మ’ అనే మాటలోనే వున్నది కమ్మదనమంతా. అందుకే పుట్టి పెరుగుతున్న కొద్దీ ఊసుల వయసు దాటిన బిడ్డ మాట్లాడే మొట్టమొదటి మాట ‘అమ్మ’. అటువంటి ‘అమ్మ’ అనసూయమ్మ గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామానికి దగ్గరలో గల మన్నవ గ్రామంలో ‘అపర బ్రహ్మ’గా ఈ భువిపై అవతరించినది. తదుపరి, వివాహానంతరం జిల్లెళ్ళమూడి విచ్చేసి గృహస్థాశ్రమం స్వీకరించి అపురూప మాతృత్వ వాత్సల్యాన్ని వర్షిస్తూ మహిమలను బిడ్డలకు ప్రదర్శించి తన అవతార ప్రకటన చేశారు. పశు పక్ష్యాదులు సహితం అమ్మలోని దైవత్వాన్ని గుర్తించి అమ్మను విడిచి వుండలేక అమ్మ సామీప్యాన్ని కోరుకోవడం, అమ్మ ప్రేమకోసం ఆరాటపడటం హద్దులు లేని అమ్మ ప్రేమకు నిదర్శనం. ఈ గ్రంధాన్ని చదివిన వారికి ‘అమ్మ’ సంపూర్ణత్వాన్ని అధ్యయనం చేసిన స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తూ..