Book Description
యదువంశ పురోహితుడు, యాదవుల కులగురువు, బలరామకృష్ణులకు నామకరణములు చేసిన పుణ్యాత్ముడు అయిన గర్గమహర్షి సంస్కృతములో రచించిన ‘‘గర్గ సంహిత’’కు తెనుగుసేత ఈ గ్రంథము. మహాభాగవతములో లేని ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు రాధాదేవి భక్తితత్పరతకు మనస్సు కరిగిపోతుంది. గోపికల జన్మజన్మల అనుబంధాలు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. పూతన పూర్వజన్మ, రజకుని పూర్వజన్మ వంటి ఎన్నో సన్నివేశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. భక్తి సాహిత్యంలో మణిపూస ఈ గర్గ భాగవతము! సుమన్బాటబు రచన ప్రసన్న సుందరము, సుమనోహరము!