Book Description
ఒంగోలు వాస్తవ్యులు కీ.శే. పమిడిపాటి వేంకట కృష్ణయ్య - శేషమ్మగార్ల కుమారుడు పమిడిపాటి గోపాలరావు అక్టోబర్ 1943లో జన్మించారు. ఒంగోలు మునిసిపల్ హై స్కూల్‍లో ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తిచేసి, సి.యస్.ఆర్. శర్మ కాలేజీలో 1961లో డిగ్రీ పుచ్చుకున్నారు. జూలై 1962లో సౌత్ సెంట్రల్ రైల్వే, మెకానికల్ విభాగంలో చేరి, 38 సంవత్సరాలకు పైగా వివిధ హోదాలలో పనిచేసి, మార్చి 2001లో అసిస్టెంట్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ (డీజిల్)గా సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. భగవద్గీత ఉపదేశాల పట్ల యువతకు అవగాహన కల్పించాలనే సంకల్పంతో వివిధ వ్యాసాలను ఆకాశవాణి, విజయవాడ ద్వారా ప్రసారం చేశారు. ధ్యానమాలిక మాసపత్రికలో వ్యాసాలను ప్రచురించారు. అలాగే ‘‘బాలల భగవద్గీత’’ అన్న చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. గీతోపదేశాలలో కొన్ని అంశాలపై యువతకు ప్రాథమిక అవగాహన కల్పించి భగవద్గీత పఠనం పట్ల, ఆచరణ పట్ల ప్రేరణ కలిగించడానికి చేసిన చిరు ప్రయత్నమే ఈ ‘‘యువతకు గీత’’.