Book Description
నాకు చిన్నప్పటినుండి కూడా దైవభక్తి, దైవ చింతన అస్సలు లేదు. గుళ్లూ గోపురాలకి వెళ్లేవాడిని కాదు. అలాంటిది నాలో పెనుమార్పు తీసుకొచ్చింది మాత్రం సాయిబాబానే. మా అబ్బాయికి పదేళ్ల వయసులో తీవ్రమయిన జ్వరం వచ్చింది. నూటనాలుగు డిగ్రీల జ్వరం వస్తే క్లినిక్‍ని తీసుకెళ్లాం. అక్కడి డాక్టర్లు ఆ జ్వరాన్ని మాత్రం తగ్గించలేకపోయారు. ఎన్ని మందులు వేసినా జ్వరం పెరుగుతూనే ఉంది. నోటిద్వారా, నరాల ద్వారా మందులు ఎక్కిస్తూనే ఉన్నారు. అయినా ఫలితం లేదు. చివరికి కనీవినీ ఎరుగని స్థాయిలో జ్వరం 108 డిగ్రీలకు చేరుకుంది. బాబు స్ప•హలో లేడు. మీ అబ్బాయి బ్రతకడం కష్టం. ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. నా కాళ్లక్రింద భూమి చీలిపోయి నేను భూగర్భంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. సరిగ్గా ఆ సమయంలో నా ఆప్తమిత్రుడు ఒకడు సాయిబాబా మహిమల గురించి ఎప్పుడో ప్రస్తావించిన విషయం గుర్తుకు వచ్చింది.