Book Description
మల్లిక్ పేరు వినగానే పెదాలమీద చిరునవ్వు కదలాడ్తుంది. హాస్యం అనగానే మొదటిగా అతని పేరే గుర్తుకు వస్తుంది. నవ్వించే కార్టూన్లు గీయడమే కాకుండా కడుపుబ్బ నవ్వించే కథలూ, సీరియల్సు కూడా రాయగలడని ‘‘పరుగో పరుగు’’, ‘‘జీవితమే ఓ ఢమాల్’’, ‘‘నవ్వితే నవరత్నాలు’’ నిరూపించాయ్. పై వాటికి ఏ విధంగానూ తీసిపోని విధంగా కామెడీకింగ్ మల్లిక్ రాసిన నవ్వుల జల్లు, హాస్యం పరవళ్ళు.