Book Description
త్రిపురనేని రామస్వామిగారిని తరచుగా పెరియార్ రామస్వామితో పోలుస్తారు. దానికి స్థూలమైన కారణం ఇద్దరూ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో వున్నారు అనే భ్రమ. కాని నిజానికి పెరియార్కీ, రామస్వామికీ ఏ రకమైన పోలికలూ లేవు. పెరియార్ ఆవేశపరుడు, రామాయణం అంటే కోపం, బ్రాహ్మల వల్లే తమిళనాడంతా పాడయిందని పెద్ద ఉద్యమం లేవదీశాడు. కాని రామస్వామి పెరియార్ కన్నా చాలా ముందు తన ఆలోచనలు సిద్ధాంతపూర్వకంగా చెప్పాడు.