Book Description
మీరు విద్యార్థి కావచ్చు. ఉపాధ్యాయులు కావచ్చు. తల్లిదంద్రులు కావచ్చు. విద్యావేత్తలు కావచ్చు. ప్రణాళికల రూపకర్తలు కావచ్చు. మీరెవరన్నాగానీ మీకు విద్య మీద ఉన్న ప్రేమకీ, విద్యని సార్వత్రికం చేయాలన్న మీ తలపుకీ బాసటగా నిలిచే పుస్తకమిదని నమ్మకంగా చెప్పగలను. మీరున్నచోటునుంచే, మీరు సామాజికంగా నిర్వహించే పాత్ర ఎంత చిన్నదయినా కానివ్వండి. మీ ప్రతి ఒక్కరి చేయూతతోనే అసంఖ్యాక ప్రజా సమూహాలు వెలుగులోకి ప్రయాణించగలవని నమ్మండి. \nమన మన వ్యక్తిగత దర్శనాలు విద్యపట్ల మనకి కలిగిస్తున్న కలల్ని, మన వ్యక్తిగత అనుభవాలు మనకి కలిగిస్తూ వచ్చిన మెలకువల్ని మనమొకరితో ఒకరం పంచుకుంటే ఇప్పుడున్నదానికన్నా మరింత బలపడతాం. మనం జీవిస్తున్న సమాజాన్నీ, ప్రపంచాన్నీ మరింత బలపర్చుకోగలుగుతాం. ఆ ఆశతో, ఆ శుభాకాంక్షలతో నా ఈ అనుభవాల్ని మీ అందరితో ఇలా పంచుకుంటున్నాను. \nఈ కృషిలో చేయిచేయి కలపడానికి ఎవరెవరు ముందుకొస్తారో వారెల్లరికీ నా స్వాగతం