Book Description
రాజపుత్రులెంత ఉన్నతపదవిని పొందినా గానీ తండ్రి మాటలను తిరస్కరిస్తే పదవిపోయి సేవకులుగా మారతారు. తండ్రిమాటను తిరస్కరించటంచేతనే యయాతి పుత్రులు, విశ్వామిత్రుని కుమారులు ఆపదలపాలయ్యారు. యయాతి పుత్రులు తండ్రి మాట వినకపోవడం చేత రాజ్యభ్రష్టులయ్యారు. విశ్వామిత్రుని పుత్రులు (మధుఛందాదులు) హీనకులాలలో జన్మించారు. మనోవాక్కాయాలతో త్రిరణశుద్ధిగా తండ్రిని సేవించేవాడే నిజమైన పుత్రుడనబడతాడు. తండ్రికిష్టమైన పనినే కుమారుడు చెయ్యాలి. తండ్రికి దుఃఖం కలిగించే పనిని పుత్రుడెంత మాత్రం చెయ్యకూడదు.