Book Description
ఇందులోని ప్రధానపాత్రలు నాలుగు. ప్రకాశం, కళ్యాణి, క్రిష్ణమూర్తులతో పాటు ఇందిర. నిజానికి ఇందిరే ప్రధానపాత్ర. ఈ కథలోని వ్యక్తులందరూ ఆమెచుట్టూ తిరుగుతూ రకరకాలుగా ప్రభావితం చెందుతూ వుంటారు. ఆమెను అంగీకరించలేరు. వదలలేరు. ఆమెవల్ల పరిచయమయిన మొదటిపాత్ర ప్రకాశం. \nఎం.బి.బి.ఎస్. చదివే ప్రకాశాన్ని అందరూ మెత్తని వాడంటారు. అసమర్థుడని కూడా కొందరనేవారు. సాటి విద్యార్థులతన్ని చూసి ‘‘వట్టి చవటవురా’’ అని తేల్చి చెప్పేవారు. ‘‘బొత్తిగా చేవలేని వాడివి. ఎలా బతుకుతావో కానీ’’ అని నిట్టూర్చేది వాళ్ళమ్మ. \n‘‘చిన్నతనం నుంచీ ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్ళేదాన్ని కాదు. నలుగురితో కలిసి ఆడుకోవడం కూడా తెలీదు... కనీసం మా నాన్నైనా నలుగురితో కలిసిమెలిసి వుండగలిగే మనిషైతే నేనిలా తయారవకపోదు నేమో! ఆయనా నాలాంటివాడే. తెలివితక•్కవవాడు కాదుగానీ అమ్మ పోయిన నాటినుంచీ జీవితంమీద అదోరకం విరక్తి పెంచేసుకున్నాడు. అందుకే నేనూ చిన్నప్పటినుంచీ అలాగే తయారయాను. చెప్పలేని ఒంటరితనం సర్వదా నన్ను బాధించేది’’ ఇవీ కళ్యాణి పెరిగిన కుటుంబ పరిస్థితులు. \nక్రిష్ణమూర్తి విశాఖపట్నంలోని ఎ.వి.యన్ కాలేజీలో బి.ఏ. చదువుతూ తాత తండ్రులిచ్చిన ఆస్తుల్ని ఖర్చుచేస్తూ కులాసాగా కాలం గడిపే విలాస యువకుడు. \n‘‘ఏం పనిచేసినా నేను కళ్ళు తెరుచుకునే చేస్తాను. నాకూ మిగతావాళ్లకీ అదే తేడా. ఏడుస్తూ ఏదీ చెయ్యను. ఏం జరిగినా ఏడవను...’’ ఇది ఇందిర వ్యక్తిత్వం. \nవిభిన్న మనస్తత్వాలు గల ఈ నలుగురి మధ్య సహృదయులైన వసుంధర, డాక్టర్ చక్రవర్తి... \nఈ ఆరుగురి మధ్య జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎవరిని ఎవరి దరి చేర్చాయో తెలుసుకోవాలంటే సహజత్వానికి అద్దం పట్టే డా।। పి.శ్రీదేవి గారి ‘‘కాలాతీత వ్యక్తలు’’ చదవవవలసిందే