Sahithi Prachuranalu

Sri Devi Bhagavatham (SP)

Sri Devi Bhagavatham (SP)
Sri Devi Bhagavatham (SP)

Sri Devi Bhagavatham (SP)

Rs. 320.00 Rs. 400.00
  • SKU: 1712547

Category : Devotional

Publisher : Sahithi Prachuranalu

Author : AINAMPUDI GURUNADHA RAO

Language : TELUGU

Book Description

శతావధాని కీర్తిశేషులు శ్రీ కోట వీరాంజనేయ శర్మగారి ఎమెస్కో వచన రామాయణము ప్రచురణ పూర్తికాగానే - అనూహ్యంగా శ్రీ దేవీ భాగవతమును వచన రూపంలో వెలువరించాలని సంకల్పం కలిగింది. అష్టాదశ పురాణాంతర్గతమగు దేవీ భాగవతమును ఆంధ్రీకరణ ఆంధ్రలోకమునకు విశేషోపకారమని వేరుగ చెప్పనక్కరలేదు గదా! ఈ సంకల్పము కలుగుటయే తరువాయి - మా చూపులు - సంస్క•తాంధ్ర ఆంగ్ల హిందీ భాషా చతుర్ముఖులు విద్వాన్‍ శ్రీ అయినంపూడి గురునాథరావుగారి దెస ప్రసరించాయి. వీరు ఈ వరకే - పండితరాయలు, మేఘసందేశం, విజయ ప్రస్థానం, కవితా ప్రభాస, కోదండరామశతకం మున్నగు పద్యకావ్యాల్ని, హనుమత్సందేశం (సుందరకాండ), గురునాధ రామాయణ బాల అయోధ్య కాండలు - గానం చేయుటకు వీలుగా గేయకావ్యంగాను వెలువరించి పలువురి ప్రశంసలను పొందియున్నారు. వీరి హనుమత్సందేశం (సుందర కాండ గేయకావ్యం) వాడవాడలా శ్రీ వారణాసి లక్ష్మీ నరసింహమూర్తి గారిచే - సప్తాహాలు పర్యంతము గానము చేయబడుతూ వేలాది ప్రజలను సమ్మోహితపరుస్తూన్నది. ఈయనలోని ఈ వైశిష్ట్యమును గుర్తించి శ్రీ దేవి భాగవతమును సరళ వచన సరళిలో మూల విధేయంగా ఆంధ్రీకరింపుడని కోరియున్నాము. కోరినదే తడవుగా గృహపరిస్థితులు ఆహ్లాదకరముగా లేకున్నను తాదాత్మ్యముతో, వినమ్ర భావముతో, ఒక పట్టుదలతో ఈ కార్యక్రమమును చేబట్టి రచన సాగించినారు. పాఠకులకు మేము లోగడ చెప్పిన ప్రకారము ఈ వచన శ్రీ దేవీ భాగవతము ఇప్పుడు అందజేయుచున్నాము. ఈ మహా కార్యక్రమమునకు పాఠకులు సహృదయముతో చేయూత నిచ్చెదరు గాక.

Additional information
Code SPBK-47
SKU 1712547
Category Devotional
Publisher Sahithi Prachuranalu
Author AINAMPUDI GURUNADHA RAO
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter