Book Description
విద్యార్థులకు గణితశాస్త్రమునందు ఆసక్తి, అవగాహన కలుగజేయుట ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యం. ఈ వేదగణితమ్ అను పుస్తకము ద్వారా రచయిత శ్రీ మల్లాది నరసింహమూర్తి కృతకృత్యులైనారు. అంకెలతో గారడి - క్విజ్ పద ఆవిర్భావం - కొన్ని ప్రధాన సంఖ్యల విశిష్టతను సముచిత రీతిలో విశదీకరించినారు. కంప్యూటర్ పుట్టు పూర్వోత్తరాలు, గణిత శాస్త్రంలోని అన్ని విభాగాల ప్రాథమిక సూత్రాలు, నిర్వచనాలు క్రోడీకరించబడినవి. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచే కిటుకులు - విషయపరిజ్ఞాన సమస్యలు - పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులకు మార్గదర్శకముగా నున్నవి.