Book Description
సనాతన వచనాలయిన వేదాలచే స్తుతింపబడినవాడు, ఓంకారమనే పద్మంలో విహరించే తుమ్మెద వంటివాడు, దేవసేలనకు ప్రభువయిన అగ్రగణ్యుడయిన బ్రహ్మణ్యుడయిన - శ్రీ సుబ్రహ్మణ్యుడు తన భక్తులకు శుభాలను ప్రసరించుగాక! అవ్యక్త పురుషుడు ఈశ్వరుడయితే, ప్రకృతిగ నిల్చింది జగదంబ. ఈ రెండు శక్తుల సమ్మేళనమే - శ్రీ సుబ్రహ్మణ్యుడు. పరమాత్మను శ్రీ సుబ్రహ్మణ్య స్వరూపంగా ఆరాధించటమే స్కాంద మతం. శివ - పార్వతుల తనయుడే శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి. ఈతని శక్తి నాలుగు దిక్కులలోనూ విస్తరించి, భూమ్యాకాశములంతటా కుమారస్వామిగా, శక్తిధరునిగా, లోకముక్తికరునిగా, ఇలవేల్పుగా, లోక ప్రసిద్ధుడయినాడు.