Book Description
ప్రసిద్ధ ఉర్దూ కవులు, ప్రాపర్టియన్ కవిత, ఆధునిక ప్రపంచకవులు, రెండు వందల ఏళ్ళ జాన్‍కీట్స్, ఇరవయ్యో శతాబ్ధం ఇంగ్లీషు కవులు, ఈ కాలం కవులు, వజ్ర శకలాలు, మొదలయినవి ప్రపంచ సాహిత్య పరిచయ గ్రంథాలు. శిఖామణి, యాకూబ్, ఆశారాజు, కందుకూరి శ్రీరాములు, కె.ఎస్. రమణ తదితర కవులపై కవిత్వ పరామర్శ గ్రంథాలు రాశారు. ఆస్కార వైల్డ్ ఆలోచనలు, నిత్య జీవితంలో ధ్యానం, అద్భుతమైన కథలు, పాశ్చాత్య సంగీతకారుల జీవితాలు, తావో తరంగాలు వంటి వైవిధ్య తాత్విక రచనలు చేశారు. అక్బర్ బీర్బల్ కథలు, గ్రీకు రోమన్ కథలు, ఈసఫ్ కథలు, మంచి మంచి కథలు వంటి ఎన్నో పిల్లల కోసం కథా సంపుటాలు తెచ్చారు. ప్రపంచ ప్రసిద్ధమైన జోక్స్ రెండు సంపుటాలు తెచ్చారు. సుప్రసిద్ధ మార్శికుడు ఓషో రచనల్ని తెలుగువాళ్ళకు పరిచయం చేసే పనిలో వున్నారు.