Book Description
సామెత అంటే పోలిక, సాధారణ ధర్మం, లోక ధర్మం, లోకోక్తి. ఒక సమాజపు అనుభవం, ఆచారాలు, పరిశీలన, అలవాట్ల నుండి సామెతలు పుడతాయి. అది నగర సమాజమైనా, గ్రామీణ సమాజమైనా. నగర సమాజం నాగరికం కాబట్టి దాని లక్షణం కొంత భిన్నంగా ఉంటుంది. గ్రామీణ జీవనమంత నేలబారుగా అది ఉండదు. చదువుకున్న వాళ్ల సంఖ్య కొంత ఎక్కువగా ఉండి కొంత దాపరికం, తెచ్చి పెట్టుకున్న మర్యాదలు ఉంటాయి. గ్రామీణ జీవనం చాలావరకు నిర్నిరోధంగా ఉంటుంది. అక్కడ సభ్య, అసభ్యతల మధ్య గీత చాలా పలచన. జంకు లేకుండా స్వేచ్ఛాభివ్యక్తి ఉంటుంది. అందుకే కులమత లింగ వివక్షా భయం తక్కువ.