Book Description
ఒక శతాబ్ది ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రను - అప్పటి హైదరాబాదు రాజ్యం (తెలంగాణ) తో సహా - ఈ సంపుటం వివరిస్తుంది. అప్పటికే ప్రారంభమైన ఆధునికీకరణ, ఆధునికతా లక్షణాలు వేగాన్ని పుంజుకోవడం మొదలుపెట్టాయి. 1857 విప్లవం బ్రిటిష్ పాలన పునాదులను కదిలించివేసి నడుస్తున్న వలస ప్రక్రియలో గణనీయమైన మార్పుకు కారణమైంది.