Book Description
“మధ్యలో వచ్చిన వాడిని నేను మీ మధ్యలేకుండా వెళ్ళిపోవటమే న్యాయం”అన్నాడు ప్రశాంత్. గాయత్రి రెచ్చిపోయినట్లుగా అంది – “ఏమిటా న్యాయం? నీ న్యాయానికి కళ్ళూ,చెవులూ లేవా? చేసుకున్న భార్యని వదిలేయటమేనా నీన్యాయం? దీనికంతటికి కారణం నువ్వు. అప్పుడే నన్ను వదిలేసి ఉంటే ఏ బాధా వుండేదికాదు! ఇలా నడిసముద్రంలో వదిలేయటానికేనా నన్ను పెళ్ళి చేసుకుంది? అసలు ఇదంతా నాతోనేగా చుట్టుకుని వున్నది. నేను చచ్చిపోతే అన్ని సమస్యలూతీరిపోతాయి.” మౌనంగా వున్న మీ మానసవీణను కదిలించే యద్దనపూడి సులోచనారాణి నవలారాజం- అభిశాపం