Book Description
మన సంప్రదాయాలు,మన సంఘం శాసించే హద్దులని నేను గౌరవిస్తాను. కానీ ఇవేవి నన్నురక్షించలేదు.మనకి ఒక ఐ.ఏ.యస్.ఆఫిసరు,ఒక ఇంజనీరు,డాక్టర్,టీచర్,ఒక సోషల్ వర్కర్ ఇలా ఆయా వృత్తులలో నిష్ణాతులుగా అవటానికి శిక్షణా కేంద్రాలున్నాయి. ఒక గృహిణి తన సమస్యలని,అన్యాయాలని ఎదుర్కోవటానికి పెళ్ళికి ముందే నిష్ణాతురాలు అవటానికి మనకి ట్రయినింగ్ సెంటర్స్ ఎందుకు లేవు? శిక్షణ యివ్వకుండా గృహిణిని చేసి, సమస్యలసాలెగూడులో స్త్రీని బంధించి యీ సంఘం ఎందుకిలా శిక్షిస్తోంది? ఇది చాలా అన్యాయం.