Book Description
ఈ కాలమ్స్ రాయడంలో నాకు ఎదురైన అతి పెద్ద సవాలు 2009 తర్వాత వచ్చింది. అప్పటికి తెలుగునాట పరిస్థితులు శరవేగంగా మారిపోసాగాయి. ఒకవైపు తెలంగాణ సెంటిమెంట్ బలంగా వ్యాపించింది. ఆ తర్వాత కొంతకాలానికి సమైక్యవాదం కూడ వ్యాప్తి చెందడం మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పత్రిక, ఛానెల్ అధిపతిగా ఉంటూ, ఏ ప్రాంత ప్రజల మనస్సూ నొప్పించకుండ రాయడం ఎవరికైనా కష్టమే. అయినా నేను బలంగా నమ్మిన అంశాలపై రాజీ లేకుండనే నా అభిప్రాయాలు తెలిపేవాడిని. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరమని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ చేపట్టిన ఉద్యమం వల్ల ప్రయోజనం లేదని స్పష్టంగానే చెప్పాను. నా వ్యాసాలు కొంతమందికి నచ్చినట్టుగానే కొంతమందికి నచ్చకపోయి ఉండవచ్చు.