Book Description
ఒక జాతి వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని తెలిపేవి ఆ జాతి మాట్లాడే భాష, అనుసరించే సంప్రదాయం, సంస్కృతి. ఆ రకంగా మన తెలుగు జాతికి ప్రాచీనమైన, విశిష్టమైన భాషాసాంస్కృతిక చరిత్ర ఉంది. తెలుగు జాతి మూడువేల సంవత్సరాల నాటిదని, భాష రెండున్నర వేల సంవత్సరాల నాటిదని, దేశం రెండు వేల సంవత్సరాల నాటిదని, సాహిత్యం వేయి సంవత్సరాల నాటిదని విజ్ఞులు చెపుతున్నారు. ఇంతటి మహోన్నతమైన మన తెలుగు జాతి భాషా సంస్కృతులు కాలగతిలో అనేక చారిత్రిక సందర్భాలలో ఎన్నో ఆటుపోటులకు గురి అయింది.