Book Description
సమకాలిక ప్రపంచంలో మనిషి హటాత్తుగా ఒక సంక్లిష్ట సందేహంలో పడ్డాడు. గొప్పకీడేమీ చేయనప్పటికీ అతను అరుచికరమైన సంబంధాలతోనూ, ఇబ్బందికర పరిస్థితులతోనూ సమస్యల నెదుర్కుంటున్నాడు. ఇబ్బందులు లేకుండా పరిస్థితులను, సంబంధాలను నిర్వహించుకోవడం అన్నిటికన్నా కష్టమైన పనిగా మారింది. మారుతున్న ప్రపంచంలో, మారుతున్న కాలంతో పాటు తన మార్పులేని దృక్కోణం ఈ పరిస్థితికి కారణమా? మనిషి తన చుట్టూ ఉన్న అనేక పరిస్థితులను గ్రహించకుండా, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని ఒకే దిశలో సాగేటట్లు తన్నుతాను నిర్దేశించుకోవడం కారణమా?