Book Description
ఆంధ్రదేశంలో విజయనగరం తరువాత మిక్కిలి పెద్దజమీందారీ వెంకటగిరి సంస్థానం. ఈ సంస్థాన ప్రభువులు వెలుగోటి వంశీయులు. ‘వెలుగోటివారి వంశావళి’ అనే గ్రంథంలో వీరి వంశచరిత్ర వర్ణింపబడింది. వీరు, ఎంతోమంది సంస్కృతాంధ్ర కవిపండితులను ఆదరించి, ఎన్నో గ్రంథాలను అంకితంగా గ్రహించినారు. అంతేకాక తమ సంస్థానంలో ‘సరస్వతీ నిలయం’ అనే పేరుతో ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పి సాహిత్యపోషణ గావించినారు. సంస్కృతాంధ్ర సాహిత్యచరిత్రలో చేర్చదగిన ఎన్నో కొత్త విషయాలను తెలియజేసే అమూల్యమైన ఈ సిద్ధాంతగ్రంథాన్ని మనకు అందజేస్తున్న డా।। కాళిదాసు పురుషోత్తంగారిని మనసారా అభినందిద్దాం.