Book Description
ఈ పృథ్వి మీద ఏ వస్తువుకైనా చలనం కావాలంటే శక్తి కావాలి. సమస్త జీవరాశులకూ శక్తిని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అందించేది సూర్యభగవానుడే అనే అంశం అవివాదాస్పదం. ఈ ప్రకృతి అంతా శక్తిమయమే. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వివిధ శక్తి స్వరూపాలే. ఒక విత్తనం మొలకెత్తాలంటే పృథ్వీశక్తి, జలశక్తి కావాలి. ఒక ఆకు రెపరెపలాడాలంటే వాయుశక్తి కావాలి.