Book Description
మన శరీరం ఆహారం వల్ల జనిస్తుంది. ఈ శరీరానికి వచ్చే వ్యాధులు కూడా అపథ్యకర ఆహారసేవనం వల్ల వస్తాయి. కనుక సుఖం (ఆరోగ్యం), దుఃఖం (అనారోగ్యం) అనేవి హితకర, అహితకర ఆహారసేవనపరిణామాలే అని అర్థం. దీన్ని బట్టి ఆహారప్రాధాన్యం ఎంతటిదో మనకు తెలుస్తోంది. గత నాలుగైదు దశాబ్దా ల క్రితం వరకు కూడా మన బామ్మగారో, అమ్మమ్మగారో, అమ్మగారో, కుటుంబం పెద్దలో మన వంటింట్లోనే లభించే దినుసుల ద్వారా ఏ అనారోగ్యానికి ఏ, ద్రవ్యాన్ని, ఏయే సందర్భాల్లో, ఎలాంటి అనుపానంతో ఏ ప్రమాణంలో, ఎన్నాళ్లు వాడాలో అనుభవపూర్వకంగా ఔషధాన్ని తయారుచేసి చూపిస్తూ, ఉపయోగిస్తూ, అవగాహన కల్పిస్తూ తర్వాతి తరాల వారికి ఆ విజ్ఞానాన్ని అందజేసేవారు. కాని సమష్టి కుటుంబవ్యవస్థ అస్తవ్యస్తమై, క్రమంగా కనుమరుగవుతూ, న్యూక్లియర్ వ్యవస్థ విస్తారమవటంతో, నిరంతరక్రమానుగతమైన ఈ విజ్ఞానప్రక్రియకు అవరోధాలు మొదలయ్యాయి. ఫలితంగా ఇలాంటి చక్కటి మహత్తరమైన అనుభవపూర్వక ఆరోగ్యవిధివిధానాలను తెలుసుకోవటం ఈ తరంవారికి గగనకుసుమమైపోవటం అందరికీ విదితమే. ఫలితంగా ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే హాస్పిటల్‌కు పరుగులు తీసే పరిస్థితి వచ్చేసింది. ఇది నాణేనికి ఒక కోణం.