Book Description
మన జీవనంతో మనం తృప్తిచెంది సంతోషంగా ఉండవచ్చు, మనకిక కావల్సిందేమీ లేదన్న సంతృప్తి కలగవచ్చు. కాని తర్వాత ఒక ఉన్నతస్థాయి ఆనందాన్ని అనుభవించినప్పుడు, మనకు నిజంగా ఆ స్థితి అర్థమవుతుంది. అట్లాగే మనం దుఃఖంగా, అసంతృప్తిగా ఉన్నప్పుడు జీవనం ఇంతకంటే ఇంకేం భయంకరంగా ఉంటుందిలే అనుకున్నప్పుడు మరింత ఘోరం జరగవచ్చు. మన నిత్య జీవితంలో జరిగే అనేకానేక సంఘటనలకు ఆధ్యాత్మికత ఒక సందర్భాన్ని ఏర్పరుస్తుంది. జీవితపు అనంత కోణాలతో వ్యవహరించడానికి అది మన శక్తిని విస్తరిస్తుంది. జీవనం గురించి, జీవితం గురించి మన అజ్ఞాన తిమిరాన్ని తొలగించుకొని నిజమైన సత్యాన్ని గ్రహించనంతవరకు మిథ్యాభ్రమలనే విశ్వసిస్తూ ఉంటాం. అస్తిత్వసందిగ్ధతలలో కొట్టుమిట్టాడుతుంటాం. జీవిత సత్యం ఒక సజీవ జీవనకళలో ఉంది – ఈ సత్యం మన ఆధ్యాత్మికత యత్నాలలో మనల్ని ముందుకు తీసుకుపోవడమేకాదు, మన చైతన్య స్పృహను కూడా పెంచుతుంది.