Book Description
లోకంలో సాక్షిగా ఉన్నవాడు చూస్తున్నట్లుగా, ఆత్మ చూస్తూ ఉండదు. అసలాత్మ నిష్క్రియం. అసలు చూడడం కూడా ఒక పని కదా! మామూలు సాక్షికి రెండు లక్షణాలుంటాయి. ఏదైనా వ్యవహారంలో అతడు చూస్తూనే ఉంటాడు కాని అందు పాల్గొనడు. కలుగజేసుకోకుండా కేవలం సాక్షిగా ఉంటాడనేది ఆత్మకే చెందుతుంది. అసలాత్మ, సాక్షిగానూ ఉండడు.