Book Description
ఎందరో జనకులున్నారు. నిమి వంశానికి చెందిన వారిని జనకు లంటారు. వారు మిథిలా నగరాన్ని రాజధానిగా చేసుకొని విదేహ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. సీత తండ్రిపేరు సీరధ్వజుడు. కుటుంబనామంతో కలిసి సీరధ్వజుడయ్యాడు. సీరం అంటే నాగలి. నాగలి గుర్తు ధ్వజంపై ఉన్నవాడు కనుక అతడట్లా పిలవబడ్డాడు. నాగేటి చాలులో లభించింది కనుక సీత అయింది.