Book Description
నరసింహముగారు పాతంజలయోగ శాస్త్రమును 16-3-1952నకు అనువాదము పూర్తి చేసిరి. ప్రారంభ వివరములు లేవు. దాదాపు 52 సంవత్సరములైనందునను గ్రంథము శిథి•లావస్థ చేరుటచేతను ముద్రించుట కుపక్రమించితిమి. రచయిత అప్పటి వరకు వివిధ భాషలలో వెలువడిన అనువాదములను పరిశీలించి తనదైన రీతిలో స్వేచ్ఛానువాదము సల్పిరి. పాతంజలయోగ సూత్రములే కాక పంచ మహాయజ్ఞ నిర్వహణ కూడ విపులీకరించిరి. ఈ గ్రంథమందు రెండు భాగములు గలవు. 1) పాతంజలయోగశాస్త్రము 2) పంచమహాయజ్ఞ విధులు, పాతంజలయోగశాస్త్రము పాతంజల యోగదర్శనమని కూడ లోకవిదితమైయున్నది. దీనియందు నాలుగు పాదములు, 194 సూత్రములు గలవు.