Book Description
పృథివికి వాస్తవిక రసము జలముకాదు. కాని, తిలలలోనున్నట్లు పృథివిలో జలమున్నది కావున జలము పృథివీరసమని చెప్పుట సంగతమే. ఓషధులు జలమునాశ్రయించి జీవించును. ఓషధులు ఉపలక్షణ మాత్రముగ అన్నము అని గ్రహింపవలెను. ఓషధుల నుండి పురుషుడు పుట్టును, ఓషధుల వలన జీవులు జీవించును. మనుష్యులు స్పష్టముగా మాట్లాడుట వాక్ అనబడును. వాక్కు పురుషునకు భూషణమై యున్నది. మానవుల స్థితి, ఉన్నతి, వృద్ధి మొదలైనవి వాణిపై ఆధారపడి యున్నవి.