Book Description
పతి సంవత్సరం ఈశా ధ్యానులు జట్టుగా కలసి హిమాలయ యాత్రకు వెళుతారు. శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు చేపడుతూ వస్తున్న యాత్ర ఇది. ఈ యాత్రికులు హిమాలయాల పట్ల ఒక నిర్బంధ వ్యామోహానికి లోనౌతారు. ఈ వ్యామోహం పురాతన కాలం నుంచీ ఉంది. ఈ వ్యామోహం సాహసం చేయడం కోసం కావచ్చు. అత్యద్భుతం, అతి స్ఫూర్తిదాయకం అయిన ప్రకృతితో ముఖాముఖీ రావడం కోసం కావచ్చు. నిర్జనారణ్యపు హృదయంలోని స్తబ్ధతను రుచి చూడడం కోసం కావచ్చు, లేదా వీటన్నిటి కోసం కావచ్చు. పర్వతారోహకులు, అన్వేషకులు, భక్తులు, సాధువులు, సంచార జాతుల వాళ్లు, యోగులు - అందరిలో ఆకాశాన్నంటే ఈ అద్భుత భూభాగాన్ని అనుభూతి చెందాలనే బలమైన ఆకాంక్ష ఉన్నట్లు అనిపిస్తుంది.