Book Description
తిరుమలేశుని సన్నిధిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు పొందిన దివ్యానుభవాల మాలిక ఈ పుస్తకం. మహిమాన్వితమైన సంకల్పం, ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారాలు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, మహానుభావులైన మన పూర్వ కవులు మనకు సంపూర్ణ వ్యక్తిత్వంగల ఒక రాముణ్ణి, ఒక కృష్ణుడిని అందించారు. ద్వైత, అద్వైత, విశిష్ఠాద్వైత, శాక్తేయాది సర్వ భారతీయ మత శాఖలు ఒకరేమిటి అందరూ తమవాడిగా, తమకు ఆరాధ్యుడుగా భావించే తిరుమలేశుడు భారతీయుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచాడు. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ప్రస్తావనకురాని శ్రీ వేంకటేశ్వరుడు భారతీయులందరి విశ్వాసాన్ని చూరగొన్న ఆరాధ్య దైవం.