Book Description
పివి నరసింహారావు తొలుత కాంగ్రెస్ అధ్యక్షుడుగా, తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తొలిరోజుల్లో నేను ఒక కీలక స్థానంలో ఉన్నాను. భారత ఆర్థిక విధానం రూపురేఖలు మారుతున్న రోజులవి. 1991 జూన్ 3 నుంచి దాదాపు 90 రోజుల పాటు పారిశ్రామిక, వర్తక, ఆర్థిక విధానాల్లో జరిగిన బృహత్తర మార్పులకు నేను సాక్షిగా ఉన్నాను. వీటిలో కొన్ని మార్పుల విషయంలో, ప్రధానంగా పారిశ్రామిక మార్పుల రూపకల్పనలో నేను సహాయకుడి పాత్ర పోషించాను. ఈ పుస్తకం నా స్వంత జ్ఞాపకాలు, కొందరు కీలక పాత్రధారులతో సంభాషణలు, సులభంగా లభ్యం కాని పార్లమెంట్ చర్చలు వంటి లిఖిత పూర్వక రికార్డులు, ఆధికారిక కథనాలపై ఆధారపడి రాసింది. సమకాలీన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, నరసింహారావు రికార్డుల్లో ఇప్పటివరకు ప్రచురితం కాని డాక్యుమెంట్లు, కాంగ్రెస్ సమావేశాల మినిట్స్, ఆ కాలానికి సంబంధించి నా స్వంత వ్యక్తిగత నోట్స్ మొదలైనవి కూడా తోడ్పడ్డాయి.