Book Description
"తలసరి ఆదాయం పెరగాలన్నది ప్రధానగమ్యంగా మారడంతో, దేశమంతటా బతుకుతెరువులు భయాందోళనలకు గురవుతున్నాయి. మనదేశం ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి అన్నది వాస్తవమే. కానీ, ఆ దారిని కాలుష్యభరితం చేయకూడదు. సంపద పేరున వనసంపదను పణంగా పెట్టకూడదు. అంతర్జాతీయంగా ఆర్థిక మహాశక్తి కావాలన్న గమ్యం కారణంగా, ఎంతో విలువయిన జీవవైవిధ్యాన్ని వదులుకోకూడదు". రాజకీయ, ఆర్థిక అంశాల గురించి ఇందిరాగాంధీ చేసిన నిర్ణయాలు ఎట్లున్నా, పర్యావరణ భద్రత గురించి ఆమె పడిన తపన మాత్రం ప్రపంచం ముందు నిలిచి ఉంటుంది.