Book Description
1953 అక్టోబర్‌లో భారత దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర జన్మించింది. 1956 నవంబర్‌లో పార్లమెంట్ ఆంధ్రప్రాంతాన్ని నిజాం అంతకుముందు పాలించిన హైదరాబాద్‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో విలీనం చేసి తెలుగు భాష మాట్లాడే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలను తెలంగాణ అనేవారు. 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసింది. 58సంవత్సరాల్లో చక్రం మళ్లీ పూర్తిగా వెనక్కి తిరిగింది. ఎందుకిలా జరిగింది? ఎలా జరిగింది? అసలేమి జరిగింది? ఈ పుస్తకం ఈ ప్రశ్నలపై వెలుగు సారించింది. - ఈ ప్రశ్నలు రెండు పక్షాల్లో ఉద్వేగాలను రేకెత్తించాయి.