Book Description
‘కథలూ, నవలలూ, కబుర్లూ, విమర్శలూ, పాటలూ పద్యాలూ చాలక ఇప్పుడీ ద్విభాషా విన్యాసం దేనికయ్యా?’ అంటే నా కారణాలు నాకున్నాయి మరి. నేనెక్కడున్నా నాకింత పెన్షన్ కూడు పెడుతున్న ఇంగ్లీషుకి (నేను రిటైరయింది ఇంగ్లీషు రీడర్‌గానే) ఏదో విధంగా బదులు తీర్చుకోవాలనే కోరిక ఒకటి. రోజురోజుకీ పెరిగిపోతున్న తెలుగుభాష మీది ‘దురభిమానం’ రెండోది. ఈ రెండూ కలిస్తే పుట్టినదే ‘అంగ్రేజీ మేడీజీ’. ఇంచు మించు సగభాగం పదాల పుట్టుక గురించీ, వాటిని గుర్తుపెట్టుకునే కిటుకుల గురించీ రాశాను.