Book Description
ఇది మూడు, నాలుగు సంవత్సరాల ముమ్మర శాసన పరిశోధనా ఫలం. నిజానికిది ఆలయ చరిత్ర మాత్రమే కాదు, భీమ మండల చరిత్ర. ఈ ప్రాంతపు అయిదు శతాబ్దాల దీర్ఘకాలపు రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యతంత్రం, సమాజం, ఆర్థిక వ్యవస్థ, మతం ఎలా ప్రకాశించాయో, భాష-లిపి ఎలా పరిణామం చెందాయో ఈ గ్రంథం వివరిస్తుంది. తెలుగులో తీరాంధ్రంలోని ఇతర చారిత్రక మతకేంద్రాల శాసన సాదృశ్యాలతో ప్రాచీన లిపి శాస్త్ర విశ్లేషణ సాగింది. భీమమండల చరిత్రకు సంబంధించి డా. జాస్తి దుర్గాప్రసాద్ గారి సునిశిత పరిశోధన ఫలితం ఈ ప్రామాణిక రచన.