Book Description
‘‘.... మొదట మనిద్దరి కోసం ప్రారంభించాను. తర్వాత వాళ్లిద్దరూ రాగానే నలుగురికి పెంచాను. అసలే కొత్తవంట కుదురుతుందో కుదరదో’’ అని హేమ్‍లెట్ పడ్డ డైలమాలో పడింది. ‘‘ఏముందీ మొన్న నేను చెప్పినట్టు అన్నీ రెట్టింపు చేసుకుంటూ పోవడమే’’ అన్నాడు పాకశాసనుడిలా రాంపండు. ‘‘మీరు చెప్పినట్టే చేశానండీ. సెగకూడా రెట్టింపు చేశాను. పుస్తకంలో పదినిమిషాలు సిమ్‍లో వుంచాలని వుంది. నేను ఇరవైనిమిషాలు వుంచాను. రెట్టింపు కదా...’’ అని నసిగింది గీత. ‘‘ఏవుందీ మాడిపోయి వుంటుంది. తెలివి... తెలివి... అసలు ఆదివారం వస్తేనే యింత’’ గొణుక్కుంటూ బాత్రూంవైపుకి దారితీశాడు రాంపండు... మామూలు పల్లకీలో కూర్చుంటే సౌఖ్యం! ప్రేమపల్లకీని మోస్తేనే సౌఖ్యం! అందుకే మరి మోసెయ్ మోసెయ్ తుమ్మెదా!