Book Description
ఇవి రోజూ మనం వినే మాటలు. మనం అనుకునే మాటలు. విన్నవాళ్ళందరికీ అర్థవంతంగా అనిపిస్తాయి. ఎదుటివాడు తన మనసులోని మాట చెప్పినట్లనిపిస్తుంది. ఎందుకలా? కొందరిని చూస్తూంటాం. మధ్యాహ్నానికల్లా తోటకూర కాడల్లా వడలిపోయి సాయంత్రం 5 ఎప్పుడవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. ఆ తరువాతయినా ఆనందంగా వుంటారా అంటే అదీ ఉండదు. ఇంటికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్తే పొద్దున్నుంచీ తెగ కష్టపడి వస్తే ఏమిటీగోల అని విసుక్కుంటారు. దీనికంతటికీ కారణం ఏమిటి?