Book Description
హాయిగా సాగిపోతున్న తన సంసార నౌక ఒడిదుడుకుల్లో పడింది. ఇప్పుడే తను పాతతరం ఆడదానిలా బెంబేలుపడి ఏడ్చి రాగాలెట్టి నా ఖర్మ ఇంతే అని సరిపెట్టుకోకుండా, ఒంటరిగా, ధైర్యంగా నిలబడి నావకి చుక్కాని పట్టి పిల్లలని ఒడ్డుకు చేర్చాలి. తనుమాత్రం నిబ్బరంగా నిలబడాలి... నిద్రపట్టే వరకు రకరకాల ఆలోచనలతో సతమతమైంది ఆమె. తండ్రికి జర్నలిజం కోర్సు చేయించి తన తరువాత తన పత్రిక ‘ఉషోదయం’ని నడపాలని కోరిక, కొడుకులు లేని ఆయనకి ఒక కూతురికైనా తన వారసత్వం అందించాలని కోరిక. ‘ఉషోదయం’ పత్రిక అందరికీ శుభోదయం పలకాలన్న కోరిక వుండేది. తను ‘లా’ చదవుతానన్నప్పుడు ఆయన కాస్త నిరాశపడ్డారు. ‘‘అవును డాడీ, మీ పత్రిక నాది. చూస్తూ వుండండి దాన్నెలా నడుపుతానో’’ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న చిన్నకూతురు గొప్పగా అంది. ఈ ముగ్గురి జీవితాలకు వారు ఎదురుచూస్తున్న ‘ఉషోదయం’ ఏ రూపంలో వచ్చింది? చదవండి డి.కామేశ్వరిగారి ‘ఉషోదయం’.