Book Description
పెళ్లిచూపులు జరుగుతున్నాయి. ‘‘ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. మీకు మీ అమ్మాయి ఒక్కర్తే సంతానంకదా! భవిష్యత్తులో మీ బాధ్యత ఎవరు తీసుకుంటారు?’’ అని అడిగాడు పెళ్లికొడుకు తండ్రి పిల్ల తల్లిని. ఆమెకు భర్తలేదు. ‘‘అయితే మీకూ మీ అబ్బాయి ఒక్కడేకదా!’’ వృద్ధాప్యంలో మీ బాధ్యత ఎవరిదీ?’’ అని అడిగింది పెళ్లికూతురు హఠాత్తుగా తలెత్తి. ‘‘అదేం ప్రశ్న? నేను మా అబ్బాయి దగ్గరే వుంటాను’’ అన్నాడు సీరియస్‍గా. ‘‘మా అమ్మా అంతే! నా వద్దనే వుంటుంది’’ అంది ఆ అమ్మాయి స్థిరంగా. అంతే... చఠాలునలేచి పెళ్లికొడుకు చెయ్యి పట్టుకుని లేవదీసి కోపంగా గడపదాటాడా తండ్రి. అటుపైన ఆ అమ్మాయి వివాహం ఎవరితో...? ఎలా... జరిగింది? కన్నకొడుకులే అల్లుళ్ల బాధ్యత ఏమిటి? అల్లుళ్లు అత్తమామలను కొడుకుల్లా చూసుకోగల అవకాశం ఎంత? మానవ్తవం మరిచిన మనుషుల మనస్తత్వాలను అక్షర రూపంలో ఆవిష్కరించిన హోతా పద్మినీదేవి నవల ‘బాధ్యత’ తప్పక చదవండి.