Book Description
‘‘మీకు... ఈ చిన్న కానుక...’’ మోహన్ ముఖంలో ఓ వెలుగురేఖ మెరిసింది. రెండు ఆకుల మధ్యన మహారాజ్ఞీలాగ విరిసిన తెల్లగులాబీ. సుతారంగా అందుకుంటూ ‘‘థాంక్స్’’ గులాబీని చూస్తూ అన్నాడు. వేణి మనస్సు వుత్సాహంతో వురకలేస్తుంది. ‘‘మీకు తెల్లగులాబీలంటే చాలా ఇష్టమటకదూ?’’ ‘‘ఎవరు చెప్పారు?’’ ‘‘అక్క చెప్పింది. మీరీ రోజు చాలా చాలా...’’ ఆగిపోయింది. ‘‘మీరు ఈరోజు చాలా బాగున్నారు తెలుసా?’’ తను చెప్పవలసిన మాట అతను పూర్తి చేశాడు. ముఖం ఎర్రగా కందిపోయింది కృష్ణవేణికి. ‘‘పరిహసిస్తున్నారా?’’ అన్నాయి ఆమె కళ్ళు. ‘‘ఉ...హూ! నిజమే చెపుతున్నాను’’ జవాబిచ్చాయి అతని కళ్ళు. అతని పాదాలమీద నుంచి క్రమంగా పైకి, పైపైకి వెళ్ళి తల్లి నుదుటన పెట్టిన కుంకుమబొట్టుమీద నిల్చిపోయింది వేణి దృష్టి. మోహన్ వేణినే చూస్తున్నాడు చిలిపిగా... ఆద్యంతం ఆసక్తిరేకెత్తించి, మనస్సులను నయగారా జలపాతాల అంచులకు తీసుకెళ్ళి, పరవళ్ళు తొక్కించే ప్రేమకథ. తుంగభద్ర.