Book Description
స్త్రీలు రాజకీయవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.గా, జడ్జీలుగా ఎంతో ఉన్నత స్థానాల్లో వున్నా, వారు ఇంటికే పరిమితమవ్వాలనీ, బట్టలుతకడం, అంట్లు తోమడం, ఇంట్లో వాళ్ళందరికీ కాఫీలు, టీలు అందించడం, ఇలా స్త్రీల మనస్సులను దానికనుగుణంగా మార్చేస్తున్నారు. సినిమాల్లో టి.విల్లో స్త్రీల శరీరాన్ని, అంగాంగాలని ప్రదర్శించి ఓ శృంగారదేవతగా, ఓ సౌందర్యమూర్తిగా చూపించినదానికంటే, ఇల్లాలు, గృహిణి, గృహమేకదా స్వర్గసీమ, ఇంటికి దీపం ఇల్లాలే అనే భావాలు వ్యాప్తి చేసే ప్రకటనల వలనే ఎక్కువ నష్టం. ఓ పక్కన క్లోనింగులతో, అంతరిక్ష ప్రయోగాలతో మానవ మేధస్సు వికసిస్తుంటే తన భాగస్వామి అయిన స్త్రీని ఇలా అణగదొక్కివేస్తే ఆనందం ఎక్కడుటుంది? ఒక బానిస - యజమాని బంధాల్లో సహజీవన మాధుర్య మెక్కడుంటుంది?