Book Description
పెళ్ళికూతురిని తీసుకువచ్చి పెళ్లిపీటల మీద కూర్చోపెట్టారు. ‘‘ఏమిటో ఈ అగ్ని ఈ హోమం... ఈ మంటలు... ఈ మంత్రాలు! అగ్నిహోమంలో నుండి వచ్చే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నట్టు, ఆ వేడికి శరీరమంతా మండిపోతున్నట్టుగా వుంది. మనసు అలజడిగా వుంది...’’ ఆ అగ్నివాసన ఆమె నరనరాల్లో ఉద్రేకాన్ని నింపుతోంది. నేతిధారకు మండే చిన్ని మంటలయినా... పెద్ద అగ్ని చీలికల్లా మీదకు వస్తున్నట్లున్నాయి. శరీరం భగ్గున మండిపోతున్నట్టు అనిపించసాగింది. పురోహితుడు ఆమె చేతిలో పెట్టినవాటిని అగ్నిలో వేయకుండా చేతి గుప్పిట్లో బిగించి పట్టుకుంది. కళ్లు ఎర్రబడ్డాయి. ఆమె ముఖం గంభీరంగా మారింది. అంతవరకు విరిసిన విరజాజి మొగ్గలా వున్న ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. కళ్లు అగ్నిగోళాల్లా అయిపోయాయి. ‘‘నో...నో... నేను ఈ అగ్నిలో వెయ్యను’’ అంది పెద్దగా. కోటి ఆశలతో పెళ్ళిపీటలమీద కూర్చున్న ఆ పెళ్ళికూతురికి హోమాన్ని చూస్తూనే ఎందుకలాంటి పరిస్థితి ఎదురయింది? చదవండి ఎన్.పూజిత గారి ‘ప్రేమకు పట్టాభిషేకం’