Book Description
గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. దాదాపు ఇరవై ఒక్కమంది గురువుల ద్వారా అనేకశాఖలలో - హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జెన్, సూపీయిజం, తంత్ర, హస్సిడిజమ్, విపాసన, రేకీ, ప్రాణిక్ హీలింగ్, సిద్ధ, ఆయుర్వేద, ఏరోబిక్స్, హిప్నాటిజమ్‍లలో శిక్షణ పొంది, వాటిని అధ్యయనం చేసినవారు. గత 35 సంవత్సరాల తమ నిరంతర సాధన ద్వారా భారతీయ ప్రాచీన విజ్ఞానంలో మరుగున పడిపోయిన అనేక పద్ధతులను తిరిగి వెలుగులోకి తెచ్చారు గురూజీ. అత్యంత క్లిష్టమైన తత్త్వ, వేదాంత సత్యాలను సామాన్యులకు అర్థమయ్యే సరళమైన భాషలో విప్పి చెప్పడం వారి ప్రత్యేకత. వారి స్వానుభవంతో, జ్ఞానోదయం ద్వారా తెలుసుకున్న జీవిత సత్యాల నుండి జన్మించిన ఆధ్యాత్మిక జీవన మార్గం అత్యంత విశిష్టమైనది. జ్ఞానోదయం పొందిన అనేక ఆధ్యాత్మిక గురువుల ప్రబోధాల సారానికి చక్కని ప్రతిబింబమే వారు ప్రవేశపెట్టిన జీవనశైలి. ప్రకృతి ధర్మాలతో పెనవేసుకుపోయిన వారి శైలి అత్యంత సులభమైనదీ, ఆచరణీయమైనదీ. వారు చూపే పద్ధతులు సామాన్య ప్రాపంచిక జీవితాన్ని అనుభవిస్తూనే సులభంగా ఆచరించదగ్గవి. లౌకిక జీవితంలోని ఆనందాన్ని, ఔన్నత్యాన్ని, శోభను, మాహాత్మ్యాన్ని అనుభవిస్తూనే ఆధ్యాత్మికంగా పరిణతి సాధించగలగడమే ఈ జీవనశైలిలోని విశిష్టత. ఈ బోధనలను కేవలం వినడమే కాదు, ఆచరించి స్వానుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రాధాన్యాన్నిస్తారు.