Book Description
ఏ పనులలో సౌందర్యం ఉంటుందో, ఏ పనులు సత్యవంతమైనవో అవి లోకంలో ఎప్పటికీ ఎవరో ఒకరిద్వారా జరుగుతూనే ఉంటాయి. కార్తీకమాసపు చివరిరోజు తెల్లవారు జామున గోదావరి నది లో వదిలిన అసంఖ్యాకమైన నెయ్యి దీపాలు, అరటి దొప్పలలో వెలిగించినవి ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసాయి. పసిపిల్లల్ని మనం తాకితే వాళ్ళకి ఎలా ఉంటుందో కానీ వాళ్లు మనని తాకితేమాత్రం మన శరీరాల సున్నితం బతికి వచ్చినట్టుంటుంది. తరతమబేధం లేకుండా పసిపిల్లల్ని ఎత్తుకుని పరవశిస్తాం అందుకే. పువ్వులూ పిల్లలే తిరిగి మన సున్నితాలని మనకి ఇవ్వగలవాళ్లు అందుకే ఈ జాజిపూల పందిరి కిందకి రమ్మని పిలుపు. సత్య, సుందర, సుకుమారాల కోసం.