Book Description
యీ సంకలనంలో సుప్రసిద్ధ సోవియట్ రచయిత బొరీస్ లవ్రెన్యోవ్ (1891-1959) కథలు మూడు వున్నాయి. అవి ‘‘నలభై ఒకటవవాడు’’, ‘‘అంత సరళమైన విషయం’’, ‘‘అర్జంటు రవాణా’’. లవ్రెన్యోవ్ కథలు పాఠకుల అభిమానాన్ని చూరగొంటాయి. అవి మానవతావాద భావాలతో నిండి వున్నాయి. ‘‘నలభై ఒకటవవాడు’’ ప్రేమను గురించిన కథ, ‘‘అంత సరళమైన విషయం’’ రష్యాలోని అంతర్యుద్ధ కాలంనాటి వీరకృత్యానికి అంకితమైంది, ‘‘అర్జంటు రవాణా’’ కుర్రవాని ప్రాణాన్ని బలిగొన్న దురాశను చిత్రిస్తుంది. యితివృత్తమూ, భాషా, శైలీ, పాత్ర పోషణతో సహా యీ కథలు సోవియట్ సాహిత్యంలో ఉత్తమ జాతికి చెందిన కథలు.